Palakonda: పాలకొండ మార్కెట్‌లో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన

Palakonda: మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పాలకొండ మార్కెట్‌ను పరిశీలించారు. షాపులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 8 Sept 2026 4:21 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండ మార్కెట్‌లో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన

పాలకొండ: మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పాలకొండ మార్కెట్లో గల షాపులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు., వ్యాపారులు తమ షాపులను, పరిసరాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మనం మన ఇళ్లను ఎంత పవిత్రంగా, శుభ్రంగా ఉంచుకుంటామో.. అలాగే షాపులను, ఆ పరిసరాలను కూడా అదే రీతిలో పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని షాపు యజమానులకు సూచించారు.

వ్యాపార వ్యర్థాలను, చెత్తను రోడ్లు లేదా పబ్లిక్ స్థలాల్లో వేయకుండా నిరోధించాలని, నిర్దేశిత చెత్తబుట్టలలోనే సేకరించి మున్సిపాలిటీకి అప్పగించాలని సూచించారు.

ఈ రకమైన తనిఖీల వల్ల మార్కెట్ ప్రాంతాలు పరిశుభ్రంగా మారడమే కాకుండా... వినియోగదారులకు ఆహ్లాదకరమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుంది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ స్వప్నిల్ జగన్నాథ్ పవార్, తహశీల్దార్ రాధాకృష్ణ,మునిసిపల్ కమీషనర్ పి.వి.నూకరాజు, సచివాలయం సిబ్బంది సిఎస్ ప్రసాదరావు ఎస్సై వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story