Parvathipuram: సీతంపేటలో ప్రశాంతంగా సాగిన మన్యం బంద్ గిరిజన సంఘాల ర్యాలీ

Parvathipuram:

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 8 Aug 2026 6:08 PM IST
Parvathipuram
X

Parvathipuram: సీతంపేటలో ప్రశాంతంగా సాగిన మన్యం బంద్ గిరిజన సంఘాల ర్యాలీ

Parvathipuram: గిరిజన హక్కులు కాపాడాలని ఆదివాసి గిరిజన సంఘాలు ఆగస్టు 8న మన్యం బంద్ కు పిలుపునిచ్చిన సందర్భంగా శనివారం సీతంపేట పట్టణంలో బంద్ ప్రశాంతంగా సాగింది. పట్టణంలోని దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేసి బందుకు మద్దతు తెలిపారు. ఆర్టీసీ బస్సులు యధావిధిగా నడిచారు. ఆదివాసి గిరిజన సంఘ నాయకులు ఆధ్వర్యంలో సీతంపేట పట్టణంలో గిరిజన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘాలు కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ ఆదివాసి హక్కుల కోసం ఈరోజు బందుకు పిలుపునిస్తే గిరిజన శాఖ మంత్రి రేపు జరగాల్సిన ఆదివాసి దినోత్సవాన్ని ఈరోజే నిర్వహించాలని చెప్పడం గిరిజనులకు ఇచ్చే మద్దతు ఇదేనా అని ప్రశ్నించారు.

గిరిజన హక్కులకి ప్రత్యేక చట్టం తెప్పిస్తానని హామీ ఇచ్చి ఇప్పటికే సుమారు 900 రోజులు గడుస్తున్న ప్రభుత్వం ఇప్పటికి ఎలాంటి ప్రకటన చేయకపోవడం గిరిజనులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. గిరిజన గిరిజన హక్కులు ఇప్పటికైనా అమలు చేయకపోతే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.

గిరిజన సంఘ సీనియర్ నాయకులు బిడ్డగా అప్పారావు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న గిరిజన హక్కులను కాలు రాస్తున్నారని దానికి కారణంగా ఈరోజు గిరిజనులు రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. జీవో నెంబర్ 3 పునరుద్దించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీను వెంటనే నెరవేర్చాలని అన్నారు.,1/70 చట్టంలో ఉన్న o లోసుగులు అన్ని పూర్తి చేసి ఆదివాసులు న్యాయం చేయాలని కోరారు.

గిరిజన సంఘం నాయకులు తిరుపతిరావు మాట్లాడుతూ గిరిజన హక్కులు కాపాడాలని నెలరోజులుగా గిరిజనులు పోరాటం చేస్తున్న ప్రభుత్వం స్పందించ పోవడంతో ఈరోజు గిరిజనులు మంది పిలుపునివ్వడం జరిగిందన్నారు. జీవో నెంబర్ 3 కి ప్రత్యామ్నాయ క్ చట్టం తీసుకొస్తామని చెప్పి ఇప్పటికీ తనపై పూర్తిస్థాయి సమాచారం ప్రభుత్వం ఇవ్వడం లేదని తెలిపారు. గిరిజన హక్కులు కాపాడాలని నాన్ షెడ్యూల్ గ్రామాలను షెడ్యూల్ గ్రామాల్లో చేర్చాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్ధరితంగా చేస్తామని తెలిపారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story