Kanchili: ఎమ్మెల్యే అశోక్ చొరవ.. పోలేరులో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు!

Kanchili: కంచిలి మండలం పోలేరులో దశాబ్దాలుగా వేధిస్తున్న లో వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.

G.RAMBABU, SOMPET
Published on: 22 Jun 2026 6:33 AM IST
Kanchili
X

Kanchili: ఎమ్మెల్యే అశోక్ చొరవ.. పోలేరులో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు!

Kanchili: కంచిలి మండలం పోలేరు గ్రామపంచాయతీలో చాలా కాలంగా ప్రజలను వేధిస్తున్న లో వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అశోక్ సహకారంతో గ్రామంలో నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు.

కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుతో గ్రామంలో విద్యుత్ సరఫరా మెరుగుపడి ప్రజలకు ఉపశమనం కలిగింది. లో వోల్టేజ్ కారణంగా ఇళ్లలో ఫ్యాన్లు, లైట్లు సరిగా వెలగకపోవడం, మోటార్లు కాలిపోవడం వంటి సమస్యలతో గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు.

ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే అశోక్, విద్యుత్ శాఖ ఏఈ గురవయ్య, సిబ్బందికి గ్రామస్థులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు రామారావు, కృష్ణారావు, ప్రకాశ్ రావు, పూర్ణ, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story