Srikakulam: హీరో రామ్ డూప్‌గా లొద్దపుట్టి యువకుడు ప్రభాకర్ రెడ్డి!

Srikakulam: శ్రీకాకుళం జిల్లా లొద్దపుట్టికి చెందిన ఆశి ప్రభాకర్ రెడ్డి ప్రతిభ. హీరో రామ్ పోతినేనికి వరుసగా 5 సినిమాల్లో బాడీ డబుల్, డూప్‌గా అవకాశం.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 13 Sept 2026 3:05 PM IST
Srikakulam
X

Srikakulam: హీరో రామ్ డూప్‌గా లొద్దపుట్టి యువకుడు ప్రభాకర్ రెడ్డి!

Srikakulam: కష్టపడే తత్వం, నటనపై మక్కువ ఉంటే వెండితెరపై స్థానం సంపాదించుకోవచ్చని నిరూపిస్తున్నాడు శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి గ్రామానికి చెందిన ఆశి ప్రభాకర్ రెడ్డి టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సినిమాల్లో ఆయనకు డూప్‌గా, బాడీ డబుల్‌గా నటిస్తూ చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నాడు.

గ్రామీణ నేపథ్యం నుంచి వెళ్లిన ప్రభాకర్ రెడ్డి, రామ్ నటించిన పలు భారీ చిత్రాల్లో రిస్క్‌తో కూడిన సన్నివేశాల్లో సైతం డూప్‌గా మెప్పించాడు. ఇప్పటివరకు ఆయన రామ్ పోతినేనితో కలిసి వరుసగా నాలుగు విజయవంతమైన ప్రాజెక్టుల్లో పనిచేశాడు:

* రెడ్ (Red)

* ది వారియర్ (The Warriorr)

* స్కంద (Skanda)

* ఆంధ్రా కింగ్ తాలూకా

ఈ సినిమాల్లో ప్రభాకర్ అంకితభావం, ప్రతిభను గుర్తించిన చిత్ర బృందం, తాజాగా రామ్ పోతినేని నటిస్తున్న ప్రతిష్టాత్మక 23వ చిత్రం (RAPO 23) లో కూడా అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

వరుసగా ఐదో చిత్రంలోనూ రామ్‌కు డూప్‌గా ఎంపికై తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుండటంతో లొద్దపుట్టి గ్రామస్తులు, స్థానిక యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రభాకర్ మరిన్ని పెద్ద అవకాశాలు అందుకొని మంచి నటుడిగా నిలదొక్కుకోవాలని గ్రామ పెద్దలు, మిత్రులు ఆకాంక్షిస్తున్నారు.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram