Palasa: అరసవల్లి ఆలయ బోర్డు మెంబర్‌గా కోర్ల కన్నారావు!

Palasa: దేవస్థానం బోర్డు మెంబర్‌గా నియమితులైన మాజీ ఎంపీపీ కోర్ల కన్నారావును మందస మండలం హరిపురం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు.

B LOKANADHAM, PALASA
Updated on: 13 Aug 2026 4:14 PM IST
Palasa
X

Palasa: అరసవల్లి ఆలయ బోర్డు మెంబర్‌గా కోర్ల కన్నారావు!

పలాస: పలాస నియోజకవర్గ పరిధిలోని మందస మండలం హరిపురం పార్టీ కార్యాలయంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం బోర్డు మెంబర్‌గా నూతనంగా నియమితులైన మాజీ ఎంపీపీ, ప్రస్తుత క్లస్టర్ ఇన్‌చార్జ్ కోర్ల కన్నారావు ని మందస మండల నాయకులు, కార్యకర్తలు ఎంతో ఘనంగా సత్కరించారు.!

ఈ సందర్భంగా హరిపురం కార్యాలయానికి విచ్చేసిన కన్నారావు కు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధికి, నియోజకవర్గ ప్రగతికి ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగానే ఈ పదవి లభించిందని నాయకులు హర్షం వ్యక్తం చేశారు. స్వామివారి ఆశీస్సులతో, పార్టీ అగ్రనాయకత్వ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆలయ సేవలలో తనవంతు పూర్తి బాధ్యత వహిస్తానని ఈ సందర్భంగా కన్నారావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మందస మండల కూటమి ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు.

B LOKANADHAM, PALASA

B LOKANADHAM, PALASA

Next Story