Kaviti: 'ఉత్తరాంధ్రకు రెక్కలొచ్చాయి' మండల స్థాయి విజేతలు వీరే
Kaviti: కవిటిలో 'ఉత్తరాంధ్రకు రెక్కలొచ్చాయి' పోటీలు నిర్వహణ. క్విజ్, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక.
Kaviti: 'ఉత్తరాంధ్రకు రెక్కలొచ్చాయి' మండల స్థాయి విజేతలు వీరే
కవిటి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న "ఉత్తరాంధ్రకు రెక్కలొచ్చాయి" కార్యక్రమంలో భాగంగా 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు మండల స్థాయిలో క్విజ్, వ్యాసరచన మరియు డ్రాయింగ్ పోటీలు బుధవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి, గిరిజన వారసత్వం, స్థానిక ఉత్పత్తులు, సహజ వనరులు, పర్యాటక ప్రదేశాలు, పారిశ్రామిక ప్రగతి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి అభివృద్ధి కార్యక్రమాలు మరియు "స్థానిక ఉత్పత్తులు – ప్రపంచ మార్కెట్లు" అనే భావనపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడం.
అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక విశిష్టతలను విద్యార్థులకు పరిచయం చేయడం, స్థానిక ఉత్పత్తులకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు హాజరవుతారు.
ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి ధనుంజయ మజ్జి మాట్లాడుతూ, "ఉత్తరాంధ్రకు రెక్కలొచ్చాయి" అనే భావన కేవలం అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో తమ ప్రాంత చరిత్ర, సంస్కృతి, గిరిజన వారసత్వం, స్థానిక వనరులు మరియు అభివృద్ధి అవకాశాల పట్ల గర్వభావాన్ని పెంపొందించే ఒక ప్రజ్ఞా ఉద్యమమని తెలిపారు.
మండల స్థాయి క్విజ్ పోటీలో బొరివంక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి డి. చందు, వ్యాసరచనలో ముత్యాల పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని బాగా దీక్షిత, డ్రాయింగ్ పోటీలలో బొరివంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి పి మనోహర్ విజేతలుగా నిలిచి గురువారం జిల్లాస్థాయిలో జరగబోవు పోటీలకు హాజరవుతారని మండల విద్యాశాఖ అధికారి 2 సనపల రామకృష్ణ తెలిపారు
స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేల విశ్వనాథం, మండలంలోని అన్ని వివిధ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్యాలయ సిబ్బంది సిఆర్ఎంటి తనుజ పాల్గొన్నారు.




