Srikakulam: బ్రెయిన్ స్ట్రోక్ బాధితుడికి గ్రామస్థుల ఆర్థిక చేయూత!
Srikakulam: కవిటి గ్రామానికి చెందిన బ్రెయిన్ స్ట్రోక్ బాధితుడు సదానంద సాహూ వైద్య చికిత్స కోసం గ్రామస్థులు రూ.21 వేల ఆర్థిక సహాయం సేకరించి అందజేశారు.
Srikakulam: బ్రెయిన్ స్ట్రోక్ బాధితుడికి గ్రామస్థుల ఆర్థిక చేయూత!
శ్రీకాకుళం: బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై చికిత్స పొందుతున్న కవిటి గ్రామానికి చెందిన టైలర్ సదానంద సాహూకు గ్రామస్థులు, మిత్రులు మానవత్వాన్ని చాటారు. ఆయన వైద్య చికిత్సకు చేయూతగా పాండవ శేఖర్, మొర్రి గోపి ఆధ్వర్యంలో రూ.21 వేల ఆర్థిక సహాయాన్ని సేకరించి శనివారం బాధిత కుటుంబానికి అందజేశారు.
సేకరించిన ఆర్థిక సహాయాన్ని మాజీ జడ్పీటీసీ బెందాళం రమేష్, ఉషోదయ యువజన సంఘం మాజీ అధ్యక్షుడు ఆరంగి మధు, సామాజిక సేవకుడు పాండవ శేఖర్ చేతుల మీదుగా సదానంద సాహూ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు, ఆపదలో ఉన్న కుటుంబాలకు సమాజం అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. సదానంద సాహూ త్వరగా కోలుకుని సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు.
స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించిన దాతలకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహాయం చికిత్సకు కొంత ఊరటనిస్తుందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మొగిలిపురి సీతారాం, తెప్పల మోహనరావు, బావన రవి, మొగిలిపురి డిల్లేశ్వరరావు, నెయ్యిల శ్రీధర్, మొర్రి గోపి తదితరులు పాల్గొన్నారు.




