Kaviti: కవిటిలో ఉపాధ్యాయుడు పూడి సురేష్‌కుమార్ పదవీ విరమణ

Kaviti: కవిటి మండలం ఇద్ధివానిపాలెం పాఠశాలలో ఉపాధ్యాయుడు పూడి సురేష్‌కుమార్ పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది.

G.RAMBABU, SOMPET
Published on: 31 Aug 2026 6:35 PM IST
Kaviti
X

Kaviti: కవిటిలో ఉపాధ్యాయుడు పూడి సురేష్‌కుమార్ పదవీ విరమణ

కవిటి: కవిటి విద్యార్థులకు, పాఠశాలకు అందించిన సేవలకు గుర్తింపుగా కవిటి మండలం ఇద్ధివానిపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎంటీఎస్‌ ఉపాధ్యాయుడు పూడి సురేష్‌కుమార్‌ పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సుదీర్ఘకాలం విద్యారంగంలో సేవలందించిన సురేష్‌కుమార్‌కు సహచర ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు ఆత్మీయంగా వీడ్కోలు పలికారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంతోషి, ఉపాధ్యాయుడు బల్లెడ లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంఈఓ-1 ధనుంజయ్‌ మజ్జి, ఎంఈఓ-2 సనపల రామకృష్ణ, ఎంటీఎస్‌ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడ్డెపు కామేష్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల ప్రయోజనాలకు పూడి సురేష్‌కుమార్‌ అందించిన సేవలు అభినందనీయమన్నారు. ఉద్యోగ విరమణ అనేది బాధ్యతల నుంచి విరామమే తప్ప సేవా భావానికి ముగింపు కాదని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.

అనంతరం పూడి సురేష్‌కుమార్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. సహచర ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story