Kaviti: కవిటి పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

Kaviti: కవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1982-83 పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికలో పాల్గొన్న ఇచ్చాపురం ఎమ్మెల్యే, విప్ బెందాళం అశోక్ బాబు.

G.RAMBABU, SOMPET
Published on: 21 July 2026 4:25 PM IST
Kaviti
X

Kaviti: కవిటి పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

కవిటి: కవిటి పాఠశాల జ్ఞాపకాలు జీవితాంతం మధురానుభూతులుగా నిలిచిపోతాయని, పూర్వ విద్యార్థుల కలయికలు అనుబంధాలను మరింత బలోపేతం చేస్తాయని ఇచ్చాపురం శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ బాబు అన్నారు.

కవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1982–83 విద్యాసంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు తమ విద్యార్థి దశ జ్ఞాపకాలను పంచుకుంటూ, అప్పటి ఉపాధ్యాయులను స్మరించుకున్నారు.

విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని, వారి మార్గదర్శకత్వమే ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పునాది అవుతుందని అశోక్ బాబు పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలు ఎంతో మంది ప్రతిభావంతులను సమాజానికి అందించాయని ఆయన అన్నారు. ప్రస్తుత విద్యార్థులు కూడా కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఇలాంటి ఆత్మీయ కలయికలు పూర్వ విద్యార్థుల మధ్య స్నేహబంధాలను మరింత బలపరచడంతో పాటు పాఠశాల అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story