Kanchili: పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సీతయ్య ఫౌండేషన్‌కు వీల్‌చైర్ల అందజేత

Kanchili: పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కంచిలి మండలం అర్జునాపురం యువత సీతయ్య ఫౌండేషన్‌కు వీల్‌చైర్లు అందించి సామాజిక బాధ్యత చాటుకున్నారు.

G.RAMBABU, SOMPET
Published on: 2 Sept 2026 4:20 PM IST
Kanchili
X

Kanchili: పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సీతయ్య ఫౌండేషన్‌కు వీల్‌చైర్ల అందజేత

కంచిలి: కంచిలి మండలం అర్జునాపురం గ్రామ యువత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వినూత్నంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో సీతయ్య ఫౌండేషన్‌కు వీల్‌చైర్లను అందజేశారు.

కొత్తగా ఏర్పాటు చేసిన సీతయ్య ఫౌండేషన్‌లోని ఫిజియోథెరపీ కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో నడవడానికి ఇబ్బందులు ఎదుర్కొనే వారు, వృద్ధులు, శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారికి వీల్‌చైర్లు ఎంతో అవసరం. ఈ అవసరాన్ని గుర్తించిన అర్జునాపురం యువత తమ వంతు సామాజిక బాధ్యతగా వీల్‌చైర్లను ఫౌండేషన్‌కు అందజేశారు.

పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, అవసరంలో ఉన్న వారికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు యువత తెలిపారు. తమ అభిమాన నాయకుడి పుట్టినరోజును సేవా దృక్పథంతో జరుపుకోవడం ద్వారా సమాజానికి తమ వంతు సహాయం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సీతయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు మోహన్, రమేష్ మాట్లాడుతూ ఫిజియోథెరపీ కేంద్రానికి వచ్చే రోగులకు వీల్‌చైర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, అవసరాన్ని గుర్తించి వీల్‌చైర్లు అందించిన అర్జునాపురం యువతకు అభినందనలు తెలిపారు. యువతలో సేవా భావాన్ని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో MTS ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడ్డెపు కామేష్ రెడ్డి, సీతయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు మోహన్, రమేష్, యువత దుర్గాసి రవి, బాకి రుషి, నాగరాజు, బుడ్డెపు దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story