Kanchili: ఎంఆర్‌సీ కేంద్రంలో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
Kanchili: కంచిలి ఎంఆర్‌సీ కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఎంఈఓలు శివరాంప్రసాద్, చిట్టిబాబులను ఉపాధ్యాయ సంఘాల నాయకులు సత్కరించారు.
Kanchili: ఎంఆర్‌సీ కేంద్రంలో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
కంచిలి: కంచిలి ఉపాధ్యాయ వృత్తికి విశిష్ట గౌరవం తీసుకొచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని కంచిలి మండల విద్యా వనరుల కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు సప్పట శివరాంప్రసాద్ (ఎంఈవో–1), కుంబి చిట్టిబాబు (ఎంఈవో–2)లను ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను సమర్థవంతంగా ముందుకు నడిపించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యా రంగానికి సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడ్డెపు కామేష్‌రెడ్డి, రెల్లా కామరాజు, దుడ్డి బాలరాజు, శంక గోపి, సామళ్ల వెంకటరావు, నల్లాన రవి, బొడ్డ వెంకటరావు, శంకర్‌రావు, ధర్మారావు, సంతోష్, శారదతో పాటు ఎంఆర్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.




