Kanchili: జామి ఎల్లమ్మ ఆలయానికి నెరవేరిన విద్యుత్ కల!
Kanchili: కంచిలి మండలం తలతంపర జామి ఎల్లమ్మ ఆలయానికి తీరిన విద్యుత్ సమస్య. టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు చొరవతో వెలుగులు జిమ్మిన దేవాలయం.
Kanchili: జామి ఎల్లమ్మ ఆలయానికి నెరవేరిన విద్యుత్ కల!
కంచిలి: కంచిలి మండలం తలతంపర గ్రామపంచాయతీ పరిధిలోని జామి ఎల్లమ్మ ఆలయానికి చిరకాల సమస్యగా ఉన్న విద్యుత్ సౌకర్యం తాజాగా కల్పించారు. ఎన్నో రోజులుగా విద్యుత్ సదుపాయం లేకపోవడంతో సాయంత్రం వేళల్లో ఆలయ పూజలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సమస్యను గుర్తించిన తెలుగుదేశం పార్టీ కంచిలి మండల అధ్యక్షులు మాదిన రామారావు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసి ఆలయానికి విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయించారు. విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో జామి ఎల్లమ్మ ఆలయం విద్యుద్దీపాల వెలుగులతో ప్రకాశించింది.
దీంతో గ్రామస్థులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ మాదిన రామారావుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి తమ వంతు సహకారం నిరంతరం కొనసాగుతుందని మాదిన రామారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బృందా బిసాయి, సేవక్ బిసాయి, గునో దొళాయి, షిమాద్రి బిసాయి, ఢిల్లీ బిసాయి, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




