Kanchili: చిన్న కొజ్జిరియాలో సొంత నిధులతో గుంతలు పూడ్చిన ముద్దపు రమణమూర్తి
Kanchili: కంచిలి మండలం చిన్న కొజ్జిరియా రహదారి గుంతలను ముద్దపు రమణమూర్తి సొంత నిధులు రూ.20 వేలతో పూడ్చారు. గ్రామస్తులు ఆయనను అభినందించారు.
Kanchili: చిన్న కొజ్జిరియాలో సొంత నిధులతో గుంతలు పూడ్చిన ముద్దపు రమణమూర్తి
కంచిలి: కంచిలి మండలం చిన్న కొజ్జిరియా గ్రామానికి ఆనుకుని ఉన్న అమ్మవారి రోడ్డు (చంద్రుపుట్టుగ లింక్ రోడ్డు) మరియు గోనప వీధికి వెళ్లే రోడ్డులో ఏర్పడిన గుంతలను పూడ్చినట్లు ముద్దపు రమణమూర్తి తెలిపారు.
ఎమ్మెల్యే బెందాళం అశోక్ అనుమతితో, టీడీపీ కంచిలి మండల అధ్యక్షుడు మాదిన రామారావు సమక్షంలో అధికారులతో మాట్లాడి ఎన్ హెచ్ 16 మెటీరియల్ తీసుకువచ్చి గుంతలను పూడ్చామని ఆయన పేర్కొన్నారు.
ఇందుకు తన సొంత నిధులు సుమారు రూ.20 వేలు ఖర్చు చేశానని తెలిపారు. గుంతలు పూడ్చడంతో వాహనదారులకు, గ్రామస్థులకు ఇబ్బందులు తొలగిపోయాయని, ఈ సందర్భంగా గ్రామస్థులు, పలువురు ఆయనను అభినందించారు.
Next Story




