Kanchili: కొల్లూరు పంచాయతీలో 100% పూర్తయిన ఓటర్ల ఎస్ఐఆర్
Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం కొల్లూరు పంచాయతీ పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) మ్యాపింగ్ ప్రక్రియ శతశాతం పూర్తయింది.
Kanchili: కొల్లూరు పంచాయతీలో 100% పూర్తయిన ఓటర్ల ఎస్ఐఆర్
Kanchili: కంచిలి మండలం కొల్లూరు పంచాయతీ పరిధిలోని కర్తలి, ఏఎస్పల్లి గ్రామాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటర్ల వివరాల డిజిటలీకరణ, ధ్రువీకరణ ప్రక్రియ శతశాతం పూర్తైంది. ఈ సందర్భంగా కొల్లూరు సచివాలయంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మాదిన రామారావు ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ విజయవంతంగా పూర్తి చేసిన బీఎల్ఎలు, బీఎల్వోలను సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా మాదిన రామారావు మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎస్ఐఆర్ ప్రక్రియను నూరు శాతం పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఓటరు జాబితా ఖచ్చితత్వాన్ని పెంపొందించడంలో బీఎల్ఎలు, బీఎల్ ్వలు, సచివాలయ సిబ్బంది సమష్టిగా కృషి చేశారని ప్రశంసించారు.
అనంతరం బీఎల్ఎలు వాసాల రమేష్ రెడ్డి, గురునాదం, బీఎల్ ్వ కుప్పిలి వెంకటరావు, జయకృష్ణలను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి, హరిబాబు, ప్రదీప్, సింహాద్రి, మృత్యుంజయ్, శంకర్, కొల్లూరు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.




