Kanchili: మకరంపురంలో సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం!

Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మకరంపురంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహణ.

G.RAMBABU, SOMPET
Published on: 21 Aug 2026 3:43 PM IST
Kanchili
X

Kanchili: మకరంపురంలో సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం!

Kanchili: కంచిలి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల ప్రయోజనాలు అందుతున్నాయా లేదా తెలుసుకునేందుకు మకరంపురం గ్రామపంచాయతీలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మకరంపురం మాజీ సర్పంచ్‌ ప్రతినిధి తమరాల శోభన్‌బాబు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వివిధ సంక్షేమ పథకాలకు అర్హత ఉన్నప్పటికీ ప్రయోజనాలు అందని వారి వివరాలను సేకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని కూటమి నాయకులు తెలిపారు.

కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ప్రతినిధి టి.వి. రమణ, తమరాల కృష్ణారావు, అప్పారావు, గున్న జగ్గారావు, బెందాళం భోగేశ్వరరావు, తమరాల రమణమూర్తి, తమరాల సూర్యనారాయణ, లండ రాజారావు, తమరాల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story