Kanchili: బొనమాలిలో వైభవంగా నిమ్మశిని అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం!

Kanchili: కంచిలి మండలం బొనమాలిలో నిమ్మశిని అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. వర్షంలోనూ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

G.RAMBABU, SOMPET
Published on: 5 July 2026 1:01 PM IST
Kanchili
X

Kanchili: బొనమాలిలో వైభవంగా నిమ్మశిని అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం!

కంచిలి: కంచిలి మండలం బొనమాలిలో నూతనంగా నిర్మించిన నిమ్మశిని అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఉదయం నుంచే వైదిక బ్రాహ్మణులు వేద మంత్రోచ్ఛారణలతో ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కుంభస్థాపన, మూలమంత్ర హోమాల అనంతరం అమ్మవారి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి మహా మంగళ హారతి ఇచ్చారు. వర్షం కురుస్తున్నా సరే గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.

గ్రామమంతా కోలాహలంగా, జాతర వాతావరణాన్ని తలపించింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడ్డెపు కామేష్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామస్థుల ఐకమత్యంతో నిర్మించిన ఆలయం గ్రామానికి కీర్తి తెస్తుందని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

అనంతరం మద్దిల ఆనంద్, భాస్కర్, జగదీష్ పట్నాయక్, బంగారు కురయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి ఆర్థికంగా, శారీరకంగా సహకరించిన గ్రామస్థులందరినీ అతిథులు అభినందించారు. చివరగా అందరికీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story