Kanchili: బోన్ మ్యారో బాధితునికి ఆర్థిక సాయం – మానవత్వం చాటుకున్న రెవెన్యూ సిబ్బంది

Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో బోన్ మ్యారో వ్యాధితో బాధపడుతున్న దుపాన మాధవరావుకు రూ.27,116 ఆర్థిక సాయం అందజేసిన రెవెన్యూ సిబ్బంది, డీలర్ల సంఘం.

G.RAMBABU, SOMPET
Published on: 24 Aug 2026 2:08 PM IST
Kanchili
X

Kanchili: బోన్ మ్యారో బాధితునికి ఆర్థిక సాయం – మానవత్వం చాటుకున్న రెవెన్యూ సిబ్బంది

కంచిలి: కంచిలి బోన్‌మ్యారో వ్యాధితో బాధపడుతున్న బురగాం గ్రామానికి చెందిన దుపాన మాధవరావుకు మండల రెవెన్యూ సిబ్బంది, ప్రాధాన్యత డీలర్ల సంఘం సభ్యులు అండగా నిలిచారు. మాధవరావు వైద్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలుసుకున్న వారు స్పందించి, సంఘం తరఫున రూ.27,116 ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఆపదలో ఉన్న వ్యక్తికి తమవంతు చేయూత అందించడం ద్వారా రెవెన్యూ సిబ్బంది, ప్రాధాన్యత డీలర్ల సంఘం సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారని గ్రామస్థులు పేర్కొన్నారు. మాధవరావు చికిత్సకు ఈ సాయం కొంత ఊరటనివ్వాలని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు నాగరాజు, ఉపాధ్యక్షుడు ప్రసాద్, కార్యదర్శి రిషి, విజయ్‌బాబు, లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story