Kanchili: మండలంలో కొత్తగా 15 మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంజూరు

Kanchili: కంచిలి మండలంలో కొత్తగా 15 మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంజూరయ్యాయి. ఎంపీడీవో వీ తిరుమలరావు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.

G.RAMBABU, SOMPET
Published on: 1 Sept 2026 10:13 PM IST
Kanchili
X

Kanchili: మండలంలో కొత్తగా 15 మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంజూరు

కంచిలి: కంచిలి మండల వ్యాప్తంగా నూతనంగా 15 మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో మండల కేంద్రంలోని సచివాలయం-1 పరిధిలో ఒకటి, సచివాలయం-2 పరిధిలో ఒక పింఛను మంజూరయ్యాయి.

మంగళవారం మండల అభివృద్ధి అధికారి వీ తిరుమలరావు చేతుల మీదుగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, కొత్తగా మంజూరైన వారికి ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటి వద్దకే పింఛను అందజేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జగదీష్ పట్నాయక్, బంగారు కురయ్య, మురళీమోహన్ పట్నాయక్, మద్దిల భాస్కరరావు, లోకనాథం తదితర గ్రామ పెద్దలు, పంచాయతీ కార్యదర్శి ఎన్ని రాంబాబు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story