Kaviti: ఘనంగా కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల 'తిరంగా ర్యాలీ'

Kaviti: శ్రీకాకుళం కవిటిలో కమిటీ కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 30 మీటర్ల జాతీయ జెండా, జాతీయ నాయకుల వేషధారణలతో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Aug 2026 1:59 PM IST
Kaviti
X

Kaviti: ఘనంగా కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల 'తిరంగా ర్యాలీ'

Kaviti: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందుగా కవిటిలోని కమిటీ కళ్యాణి ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల విద్యార్థులు నిర్వహించిన తిరంగా ర్యాలీ దేశభక్తిని చాటుతూ ఆకట్టుకుంది. చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని, దేశభక్తి నినాదాలు చేస్తూ విద్యార్థులు కవిటి పురవీధుల్లో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు.

స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ నాయకుల వేషధారణలో విద్యార్థులు పాల్గొనడం ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 30 మీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని విద్యార్థులు ప్రదర్శించగా, భారతమాత వేషధారణతో పాటు అల్లూరి సీతారామరాజు, స్వామి వివేకానంద, భగత్‌సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, సరోజినీ నాయుడు, మహాత్మాగాంధీ, జ్యోతిరావు పూలే, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్, సైనికుడి వేషధారణలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.

‘భారత్‌ మాతాకీ జై’, ‘వందేమాతరం’ నినాదాలతో పురవీధులు మార్మోగాయి. ర్యాలీ ఆయా కూడళ్ల మీదుగా సాగుతున్న సమయంలో స్థానికులు, మహిళలు విద్యార్థులను ఉత్సాహపరుస్తూ జాతీయ పతాకంపై పుష్పాలు చల్లి అభినందించారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను విద్యార్థుల్లో పెంపొందించేలా నిర్వహించిన ఈ కార్యక్రమం పలువురిని ఆకట్టుకుంది.

కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story