Palakonda: పాలకొండ జగన్నాథ స్వామి ఆలయంలో ఘనంగా జ్యేష్టాభిషేకం

Palakonda: పాలకొండ జగన్నాథుడికి జ్యేష్టాభిషేకం. నేటి నుండి 15 రోజుల పాటు స్వామివారికి అనవసర (చీకటి) గదిలో విశ్రాంతి, ప్రత్యేక ఆయుర్వేద ఉపచారం.

KAILASH SAHU, PALAKONDA
Published on: 30 Jun 2026 9:31 AM IST
Palakonda
X

Palakonda: పాలకొండ జగన్నాథ స్వామి ఆలయంలో ఘనంగా జ్యేష్టాభిషేకం

పాలకొండ: పాలకొండ లో వెలసిన శ్రీ జగన్నాథ్ స్వామి ఆలయం లో జ్యేష్ట అభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా జ్యేష్ట మాసంలో పూర్ణమి రోజున ప్రతిష్ట ఉగ్రహాలు అభిషేకం నిర్వహిస్తున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు విశ్వనాధ్ దాస్ తెలిపారు.

స్వామివారి అభిషేకం అయ్యాక స్వామివారు చీకటి గదిలో 15 రోజులు వరకు ఉంటారని తెలిపారు. పురాణాలు ప్రకారం స్వామివారికి 15 రోజులు వరకు జ్వరం వస్తుందని అందుకే చీకటి గదిలో ఉంచి పళ్ళు పలహారులు తో మందులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.

అన్నబోగం అంటే మహా ప్రీతి అయిన స్వామి వారు జ్యేష్ట పౌర్ణమి నుండి జ్యేష్ట అమావాస్య వరకు పళ్ళు ఫలహారాలు ఆయుర్వేద మందులతో సమర్పించినట్టు తెలిపారు. పూరి దేవాలయంలో ఈ 15 రోజులు స్వామివారికి ప్రత్యేక వైద్యులు వచ్చి పరీక్షలు చేసి మందులు ఇస్తారని తెలిపారు.

అమావాస్య రోజున స్వామివారి సంప్రోక్షణ చేసి స్వామివారు సుదర్శన్ చక్రాన్ని రథంపై ప్రతిష్ట చేస్తున్నట్టు తెలిపారు. స్వామివారికి అమావాస్మ రోజున భోగం పెట్టీ దాన్ని భక్తులు ప్రసాదాం గా స్వీకరిస్తారు అని దాని ద్వారా సంవత్సరం మొత్తం ఆయురారోగ్యాలతో ఉంటారని భక్తుల నమ్మకామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story