Palakonda: జగన్నాథ రథయాత్ర సిబ్బందికి ప్రత్యేక టీ షర్టుల పంపిణీ
Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ జగన్నాథ రథయాత్ర విధుల్లో పాల్గొనే సిబ్బందికి కమిషనర్ నూకరాజు ప్రత్యేక టీ షర్టులు పంపిణీ చేశారు.
Palakonda: జగన్నాథ రథయాత్ర సిబ్బందికి ప్రత్యేక టీ షర్టుల పంపిణీ
పాలకొండ: ఉత్తరాదిలో అత్యంత ప్రాశస్త్యం పొందిన పాలకొండ జగన్నాధుని రధయాత్రలో పాల్గొనే సిబ్బందికి నగరపంచాయితీ కమిషనర్ నూకరాజు ప్రత్యేక టీ షర్ట్ లు పంపిణి చేసారు.ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ టీడీపీ అధికారప్రతినిధి గంటా సంతోష్ ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు.
రధయాత్రలో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతిరోజు శానిటేషన్ చేయడంతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించడంలో నగరపంచాయితీ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని నగరపంచాయితీ కమిషనర్ నూకరాజు తెలిపారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగిన ఈ టీ షర్ట్ లతో ఉన్న నగరపంచాయితీ సిబ్బంది దృష్టికి తీసుకువస్తే ఆ సమస్య పరిష్కారం చేస్తారని తెలిపారు.
Next Story




