Ichchapuram: కేశుపురం చిన్న గెడ్డ వద్ద కాజువే నిర్మాణానికి అధికారుల స్థల పరిశీలన
Ichchapuram: ఇచ్ఛాపురం మండలం కేశుపురం చిన్న గెడ్డ వద్ద వర్షాకాలపు రాకపోకల ఇబ్బందుల నివారణకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి కాజువే నిర్మాణ స్థలాన్ని పరిశీలించి అంచనాలు సిద్ధం చేశారు.
Ichchapuram: కేశుపురం చిన్న గెడ్డ వద్ద కాజువే నిర్మాణానికి అధికారుల స్థల పరిశీలన
ఇచ్ఛాపురం: మండలంలోని కేశుపురం చిన్న గెడ్డ వద్ద కాజువే నిర్మాణానికి అధికారులు సోమవారం స్థల పరిశీలన చేపట్టారు. జేఈతో పాటు సంబంధిత శాఖల అధికారులు, రైతులతో కలిసి గెడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. కాజువే నిర్మాణానికి అవసరమైన అంచనాలను సిద్ధం చేసే ప్రక్రియను ప్రారంభించారు.
వర్షాకాలంలో గెడ్డ పొంగడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో కాజువే నిర్మాణ ప్రతిపాదనను పరిశీలించారు. గెడ్డ వెడల్పు, నీటి ప్రవాహం, నిర్మాణానికి అవసరమైన సాంకేతిక అంశాలను పరిశీలించి నివేదిక రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కాజువే నిర్మాణం పూర్తయితే పరిసర గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు రైతులకు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు తెలిపారు. ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనకు త్వరితగతిన పరిపాలనా అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని కోరారు.
స్థల పరిశీలనలో ఏపీ ప్రభుత్వ నాటక అకాడమీ డైరెక్టర్ దక్కత.కామేశ్వరరావు, మాజీ ఎంపీపీ దక్కత.డిల్లీరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు పిట్ట.పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి గుజ్జు.భీమరాజురెడ్డి, బుడత.శ్యాంసుందర్‌రావు, గ్రామనాయుడు సూరు.కామరాజు, కొయ్య.జగ్గారావు, బుడత.తిరుపతి తదితరులు పాల్గొన్నారు.




