Ichchapuram: ఇచ్ఛాపురం 28వ వార్డు ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల!

Ichchapuram: ఇచ్ఛాపురం మున్సిపాలిటీ 28వ వార్డు ఓటర్ల ముసాయిదా జాబితాను కమిషనర్ విడుదల చేశారు. అభ్యంతరాలు ఉంటే ఈ నెల 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 14 Sept 2026 1:13 PM IST
Ichchapuram
X

Ichchapuram: ఇచ్ఛాపురం 28వ వార్డు ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల!

Ichchapuram: ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డు ఓటర్ల ముసాయిదా జాబితాను ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం-1965 నిబంధనల ప్రకారం సిద్ధం చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు.

ఈ జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా గుర్తించి నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజల పరిశీలనార్థం ఈ జాబితాను స్థానిక మున్సిపల్ కార్యాలయం, ఆర్డీవో (RDO) ఆఫీస్, తహశీల్దార్ కార్యాలయ నోటీస్ బోర్డులలో అందుబాటులో ఉంచామన్నారు.

17లోగా అభ్యంతరాలు తెలపాలి ఈ ముసాయిదా జాబితాలో తమ పేర్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదా మహిళా ఓటర్లుగా చేర్చాలని కోరేవారు, అలాగే ఇప్పటికే నమోదైన ఓటర్ల కేటగిరీలపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నవారు ఈ నెల 17వ తేదీ లోపు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవచ్చని కమిషనర్ స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా మున్సిపల్ కార్యాలయ పనివేళల్లో క్లెయిమ్‌లు, అభ్యంతరాలను అధికారులకు సమర్పించాలని ఆయన సూచించారు.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram