Kanchili: ఇచ్చాపురంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ: ప్రభుత్వ విప్!

Kanchili: రూ. 3,39,822 విలువైన సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను ప్రభుత్వ విప్, ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాబు పంపిణీ చేశారు.

G.RAMBABU, SOMPET
Published on: 4 Aug 2026 9:46 PM IST
Kanchili
X

Kanchili: ఇచ్చాపురంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ: ప్రభుత్వ విప్!

కంచిలి: కంచిలి వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కంచిలి మండలానికి చెందిన నలుగురు బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా రూ.3,39,822 ఆర్థిక సాయం మంజూరైంది. మంజూరైన చెక్కులను మంగళవారం ఇచ్చాపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాబు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

మండలంలోని బాధిత కుటుంబాల పరిస్థితిని కంచిలి మండల పార్టీ అధ్యక్షుడు మాదిన రామారావు ఎమ్మెల్యే అశోక్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వారి దరఖాస్తులు పరిశీలనకు వెళ్లి అర్హులైన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరైంది.

చెక్కుల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద కుటుంబాలకు వైద్య చికిత్స భారంగా మారిన సందర్భాల్లో ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఊరటనిస్తోందన్నారు. ఆపదలో ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి కొనసాగిస్తామని తెలిపారు.

సీఎంఆర్ఎఫ్ కింద నరసన్నముకుందపురానికి చెందిన మునకాల మోహిత్కు రూ.1,28,503, మఖరాంపురానికి చెందిన సాలిన జానకిరావుకు రూ.97,524, బూరగాం గ్రామానికి చెందిన దూఫాన మాధవరావుకు రూ.65,000, పురుషోత్తపురానికి చెందిన పైల హరికృష్ణకు రూ.48,795 చొప్పున చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో కంచిలి మండల పార్టీ అధ్యక్షుడు మాదిన రామారావు, పిఏసిఎస్ చైర్మన్ పైల పురుషోత్తంరెడ్డి, టివి రమణ, మద్దిల ఆనంద్ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story