Ichchapuram: పంట పొలాల్లో ఇచ్చాపురం బోటనీ విద్యార్థుల క్షేత్ర పర్యటన!
Ichchapuram: ఇచ్చాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోటనీ విద్యార్థుల క్షేత్ర పర్యటన. తేలుకుంచి గ్రామంలో వ్యవసాయ సాగు, పంటల సంరక్షణపై అవగాహన.
Ichchapuram: పంట పొలాల్లో ఇచ్చాపురం బోటనీ విద్యార్థుల క్షేత్ర పర్యటన!
Ichchapuram: ఇచ్చాపురం పుస్తకాల్లో చదివిన వృక్షశాస్త్ర పాఠాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ.. రైతు కష్టం, వ్యవసాయ సాగు విధానాలపై ప్రత్యక్ష అవగాహన పొందారు ఇచ్చాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోటనీ విద్యార్థులు. తృతీయ సంవత్సరం ఐదో సెమిస్టర్ మేజర్ బోటనీ విద్యార్థులకు శుక్రవారం తేలుకుంచి గ్రామంలోని పంట పొలాల్లో క్షేత్ర పర్యటన నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. కృష్ణ ఆధ్వర్యంలో బోటనీ లెక్చరర్ టి. బృందావనం ఈ పర్యటనను నిర్వహించారు. విద్యార్థులు పంట పొలాలను సందర్శించి వివిధ పంటల సాగు విధానాలు, వాటి ఎదుగుదల, పంటల సంరక్షణ తదితర అంశాలను పరిశీలించారు. పంటలకు సోకే వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణకు రైతులు తీసుకుంటున్న జాగ్రత్తలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. విత్తనం నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులు పడుతున్న శ్రమను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ బి. కృష్ణ మాట్లాడుతూ విద్య కేవలం తరగతి గదికే పరిమితం కాకూడదని అన్నారు. పుస్తకాల్లో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం ద్వారా విద్యార్థులకు విషయ పరిజ్ఞానంతో పాటు ఆచరణాత్మ.




