Ichapuram: ఇచ్ఛాపురంలో రెండో రోజు మహానాడు వేడుకలు
Ichapuram: ఇచ్ఛాపురం కృష్ణతేజ ఫంక్షన్ హాల్లో ఘనంగా తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు.
Ichapuram: ఇచ్ఛాపురంలో రెండో రోజు మహానాడు వేడుకలు
ఇచ్ఛాపురం: మున్సిపాలిటీ క్లస్టర్-3 పరిధిలో టౌన్ పార్టీ అధ్యక్షుడు పత్రి తవిటయ్య ఆధ్వర్యంలో కృష్ణతేజ ఫంక్షన్ హాల్లో మహానాడు వేడుకలు 2వ రోజు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ముందుగా బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అబ్జర్వర్ చౌదరి అవినాష్, డీసీఎంఎస్ ప్రెసిడెంట్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మహానాడు సందేశాన్ని కార్యకర్తలకు వివరించారు.
‘ఎన్టీఆర్ ఆశయ సాధనే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి’ అని నాయకులు పిలుపునిచ్చారు. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కార్యదర్శి నందిగం కోటేశ్వరరావు, పట్టణ టీడీపీ నాయకులు కాళ్ల ధర్మారావు, కాళ్ల దిలీప్ కుమార్, సాలిన ఢిల్లీ, నందికి జానీ, కొండా శంకర్ రెడ్డి, ఆసి లీలరాణి, బత్తిన కృష్ణయ్య, కాళ్ల జైదేవ్, వూన సంతోష్ కుమార్, దడ్డ గిరీష్ కుమార్, కొర్రాయి ధర్మరాజు, కాళ్ల అర్జునుడు, గోపాల్ ఆచారి, ఎస్ఎన్ పండా తదితరులు పాల్గొన్నారు.




