Ichchapuram: రాష్ట్రస్థాయి క్యారమ్స్ పోటీల్లో హరిప్రియ ప్రతిభ: ప్రథమ స్థానం

Ichchapuram: రాష్ట్రస్థాయి క్యారమ్స్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన లమ్మత హరిప్రియను ప్రభుత్వ విప్, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌బాబు ఘనంగా సన్మానించారు.

G.RAMBABU, SOMPET
Published on: 5 Aug 2026 7:09 PM IST
Ichchapuram
X

Ichchapuram: రాష్ట్రస్థాయి క్యారమ్స్ పోటీల్లో హరిప్రియ ప్రతిభ: ప్రథమ స్థానం

ఇచ్చ్చాపురం: కవిటి నెల్లూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్యారమ్స్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించి ప్రతిభ చాటిన లమ్మత హరిప్రియను ప్రభుత్వ విప్, ఇచ్చాపురం శాసనసభ్యుడు బెందాళం అశోక్‌బాబు ఘనంగా సన్మానించారు. కవిటి మండలం రామయ్యపుట్టుగలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమెను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అశోక్‌బాబు మాట్లాడుతూ, రాష్ట్రస్థాయిలో విజేతగా నిలిచి ఇచ్చాపురం నియోజకవర్గానికి మంచి గుర్తింపు తీసుకురావడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడల్లో రాణిస్తున్న యువతకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని, హరిప్రియ భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

హరిప్రియ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం తెలుగు యువత నాయకులు, జగతి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పూడి ప్రవీణ్, బి. శరత్‌బాబు, డి. మల్లీశ్వరరావు, ల. పవన్, గ్రామస్థులు పాల్గొని హరిప్రియను అభినందించారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story