Palakonda: పాలకొండలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ సబ్ కలెక్టర్ స్వప్నల్!
Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. సబ్ కలెక్టర్ స్వప్నల్ పవార్ ర్యాలీని ప్రారంభించి ప్రసంగించారు.
Palakonda: పాలకొండలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ సబ్ కలెక్టర్ స్వప్నల్!
Palakonda: భారత్ మాతాకి జై అనే నినాదంతో పాలకొండ పట్టణం మారుమోగింది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పాలకొండ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ స్వప్నల్ పవార్ పాల్గొని ప్రారంభించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ స్వప్నల్ పవార్ మాట్లాడుతూ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు.
ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
Next Story




