Kaviti: క్యాంపు ఆఫీసులో 41 మందికి కొత్త పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Kaviti: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ బాబు కవిటి మండలానికి చెందిన 41 మంది లబ్ధిదారులకు నూతన సామాజిక భద్రత పింఛన్లను పంపిణీ చేశారు.

G.RAMBABU, SOMPET
Published on: 30 July 2026 9:54 PM IST
Kaviti
X

Kaviti: క్యాంపు ఆఫీసులో 41 మందికి కొత్త పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కవిటి: కవిటి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఇచ్చాపురం శాసనసభ్యుడు బెందాళం అశోక్ బాబు అన్నారు. నూతనంగా మంజూరైన 41 సామాజిక భద్రత పింఛన్లను గురువారం తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తోందన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హుల జీవనోపాధికి సామాజిక భద్రత పింఛన్లు అండగా నిలుస్తున్నాయని చెప్పారు. ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతతో పాటు అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల ఎంపీడీవోలు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story