Palasa: పలాసలో గిరిజన మత్స్యకారులకు సబ్సిడీ పరికరాలు పంపిణీ!
Palasa: పలాసలో గిరిజన మత్స్యకారులకు 75 శాతం సబ్సిడీపై మోపెడ్లు, ఐస్ బాక్సులు, వలలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Palasa: పలాసలో గిరిజన మత్స్యకారులకు సబ్సిడీ పరికరాలు పంపిణీ!
పలాస: పలాస నియోజకవర్గంలోని గిరిజన మత్స్యకారుల జీవనోపాధిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా, ఈరోజు పలాస ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ITDA, సీతంపేట మరియు మత్స్యశాఖ, శ్రీకాకుళం సంయుక్త ఆధ్వర్యంలో SCA to TSS – 2020–21 పథకం కింద లబ్ధిదారులకు మత్స్య పరికరాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష గారు లబ్ధిదారులకు 75 శాతం సబ్సిడీపై 7 మోపెడ్లకు అనుసంధానించిన ఐస్ బాక్స్‌లు, 5 చేపల వలలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష గారు మాట్లాడుతూ, గిరిజన మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆధునిక పరికరాల వినియోగంతో చేపల నిల్వ, రవాణా సులభతరం కావడంతో పాటు వారి ఆదాయం పెరిగేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి అర్హులైన లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్ డి వో గారు ఐటిడిఏ, మత్స్యశాఖ అధికారులు, గ్రంథాలయ చైర్మన్ పీరికట్ల విఠల్ గారు భావన దుర్యోధన గారు లబ్బ రుద్రయ్య గారు తమరియా భాస్కర్ గారు ముంజేటి చంద్రశేఖర్ గారు సవర సోమేశ్వర రావు గారు ప్రభుదాస్ గారు ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.




