Palakonda: పాలకొండలో ఘనంగా గిడుగు వెంకట రామమూర్తి జయంతి!
Palakonda: పాలకొండలో గిడుగు వెంకట రామమూర్తి జయంతి వేడుకలు. వాడుక భాషా ఉద్యమ పితామహుడి సేవలను కొనియాడిన గ్రంథాలయ అధికారులు.
Palakonda: పాలకొండలో ఘనంగా గిడుగు వెంకట రామమూర్తి జయంతి!
Palakonda: తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి* జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటం నకు పూలదండ వేసి ఆయన సేవలు ఘనంగా కొనియాడారు. పంతులు గారు శ్రీకాకుళం జిల్లా పర్లాఖిమిడి లో 1863 ఆగస్ట్ 29న జన్మించారు.
పండితులకే పరిమితమైన గ్రాంథిక భాష స్థానంలో సాధారణ ప్రజలు మాట్లాడే వ్యహరిక భాషగాను చదువురులకు రచనలోకి తీసుకునివచ్చారు.తెలుగు భాషాభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన పుట్టినరోజునే రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషాదినోత్సవంగా ప్రకటించారు సవర భాష సేవలు గిరిజనులులైన సవర భాష ను అధ్యయనం చేసి లిపిని, నిఘంటువు ను తయారు చేశారు.
అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు 1913లో రావు సాహెబ్ అని,1934 లో కైజర్ - ఇ- హింద్ అని బిరుదులను ఇచ్చారు. 1938 లో ఆంధ్ర విశ్వకళాపరిషత్ కళా ప్రపూర్ణ బిరుదును ఇచ్చారు. స్థానిక ఇంచార్జి గ్రంథాలయ అధికారి బబ్బురు గణేష్ బాబు,పాఠకులు సచివాలయం అడ్మిన్ శివ కుమార్ సహాయకురాలు కళ్యాణి పాల్గొన్నారు.




