Tekkali: టెక్కలి బాలకపేటలో ఈగల దండయాత్ర.. వణికిపోతున్న ఊరు

Tekkali: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బాలకపేటలో ఈగల స్వైరవిహారం. వారం రోజులుగా నిద్ర, ఆహారం లేక గ్రామస్తుల ఇబ్బందులు.

RAMBABU, TEKKALI
Published on: 10 July 2026 2:10 PM IST
Tekkali
X

Tekkali: టెక్కలి బాలకపేటలో ఈగల దండయాత్ర.. వణికిపోతున్న ఊరు

టెక్కలి: రాజమౌళి తీసిన ఈగ సినిమాలో ఏదో ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని చంపడం చూశాం .ఆ సినిమాలో మాదిరిగానే శ్రీకాకుళం జిల్లాలో ఒక ఘటన చోటుచేసుకుంది, శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బాలకపేట గ్రామంలో ఆ ఊరిపై పగ పెంచుకుంటున్నట్టుగా ఈగలు దండయాత్ర చేశాయి. గత వారం రోజులకు గ్రామస్తులను ఈగలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి, వారం రోజులుగా రాత్రి పగలు తేడా లేకుండా భోజనాలు కూడా చేయ నీయకుండా నిద్ర కూడా పోనివ్వకుండా గ్రామస్తులకు ఇబ్బందులు గురిచేస్తున్నాయి.

ఎన్ని రసాయనేలు ప్రయోగించిన, ఎటువంటి పరిష్కారాలు చేసిన వారం రోజులుగా ఈగలు వెళ్లకపోవడంతో పాటుగా తమ చుట్టే తిరుగుతూ ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుండడం పలు అనుమానాలకు తావిచ్చింది, ఇది ప్రకృతి వైపరీత్యము లేదా అకాల వర్షాల వల్ల జరుగుతున్న పరిణామము అర్థం కాక గ్రామస్తులు తల పట్టుకుంటున్నారు, అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత అధికారులు కూడా కొంతమేర పరిష్కారం చూపినప్పటికీ ఈగలు తగ్గుముఖం పట్టలేదు.

వీటికి పరిష్కారం దొరకకపోవడంతో గ్రామస్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు పంచాయతీ మరియు వైద్య సిబ్బంది గ్రామం చుట్టూ బ్లీచింగ్ మరియు కొన్ని రసాయనాలు స్ప్రే చేసిన తర్వాత కొంతమేర ఉపశమనం లభించింది. గ్రామస్తులకు ఎటువంటి హాని జరిగిన అత్యవసర సమయంలో అందుబాటులో ఉండే విధంగా మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అయినా దీనికి శాశ్వత పరిష్కారం దొరకకపోవడంతో గ్రామస్తులలో ఇంకా ఆందోళన తగ్గలేదు, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలంటూ అధికారి యంత్రంగానికి మొరపెట్టుకున్నారు.

RAMBABU, TEKKALI

RAMBABU, TEKKALI

Next Story