Srikakulam: స్వర్ణాంధ్ర నిర్మాణంలో కీలక మైలురాయి.. అమరావతి విజయంపై తేజబాబు హర్షం

Srikakulam: అమరావతి రాజధాని బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంతో ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో కూటమి నాయకులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 April 2026 1:01 PM IST
Srikakulam
X

Srikakulam: స్వర్ణాంధ్ర నిర్మాణంలో కీలక మైలురాయి.. అమరావతి విజయంపై తేజబాబు హర్షం

Etcherla: ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రం లో ఈ రోజు ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు శాసనసభ్యులు నడుకుదిటి ఈశ్వరరావు గారి ఆదేశాలు మేరకు వారి తనయుడు తేజబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం పొందడంతో సంతోషం వ్యక్తం చేస్తూ జై అమరావతి నినాదాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేసారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారి అబ్బాయి తేజబాబు మాట్లాడుతూ ప్రజా రాజధాని ఈరోజు పార్లమెంట్ ఉభయ సభల్లో లో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవమని, రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం ఇది. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది ఓ కీలక మైలురాయి కాబోతుందని తన ఆనందాన్ని వ్యక్తం చేసారు.

ఈ కార్యక్రమం లో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు లంక శ్యామలరావు, ఉపాధ్యక్షులు కలిశెట్టి సూర్యనారాయణ, ప్రధానకార్యదర్శి మండపాక కనకారావు, సీనియర్ నాయకులు పిసిని జగన్నాధం నాయుడు, ఆనందరావు, పిన్నింటి బానోజీ నాయుడు, పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story