Rajam: ఓటరు జాబితా సవరణను పరిశీలించిన ఈఆర్‌వో!

Rajam: రాజాం పట్టణం గాయత్రి కాలనీలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఇంటింటి ఎన్యుమరేషన్ ప్రక్రియను ఈఆర్‌వో వెంకటరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

SRIDHAR, RAJAM
Published on: 4 July 2026 11:14 AM IST
Rajam
X

Rajam: ఓటరు జాబితా సవరణను పరిశీలించిన ఈఆర్‌వో! 

రాజాం: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ–2026 (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా రాజాం పట్టణంలోని 137వ పోలింగ్ బూత్ పరిధిలోని గాయత్రి కాలనీలో శుక్రవారం ఇంటింటి ఎన్యుమరేషన్ ప్రక్రియను ఓటరు నమోదు అధికారి (ఈఆర్‌వో) ఈ. వెంకటరెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఓటర్ల వివరాల నమోదు, ఫారాల సేకరణ, ఎన్యుమరేషన్ నిర్వహణను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్‌వో శంకరావు, బీఎల్‌వో బాలివాడ శివ, టీడీపీ బీఎల్‌ఏ కొండవీటి కోటి, అసిస్టెంట్ బీఎల్‌ఏలు లావేటి రాజేశ్వరి, లావేటి పద్మ పాల్గొన్నారు.

SRIDHAR, RAJAM

SRIDHAR, RAJAM

Next Story