Duganaputtuga: 13 మంది నుండి ఏకంగా 65 మందికి పెరిగిన విద్యార్థుల సంఖ్య

Duganaputtuga: శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం దుగానపుట్టుగ ఎంపీయూపీ స్కూల్ లో విద్యార్థుల సంఖ్య 65కు పెరగడంతో ప్రభుత్వం మోడల్ ప్రాథమిక పాఠశాల హోదా మంజూరు చేసింది.

G.RAMBABU, SOMPET
Published on: 22 July 2026 5:20 PM IST
Duganaputtuga
X

Duganaputtuga: 13 మంది నుండి ఏకంగా 65 మందికి పెరిగిన విద్యార్థుల సంఖ్య

దుగనపుట్టుగా: కవిటి మండలం దుగానపుట్టుగ ఎంపీయూపీ పాఠశాలకు ఈ విద్యా సంవత్సరం మోడల్ ప్రాథమిక పాఠశాల హోదా లభించింది. గతంలో ఎనిమిదో తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కేవలం 13 మందికి తగ్గిపోవడంతో పాఠశాల కొనసాగింపుపై ఆందోళన నెలకొంది. అయితే ప్రధానోపాధ్యాయురాలు జోష్నా ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, యువకులు, తల్లిదండ్రులు కలిసి చేసిన కృషి ఫలితంగా విద్యార్థుల సంఖ్య 65కు చేరుకుంది.

విద్యార్థుల సంఖ్య పెరగడాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పాఠశాలను మోడల్ ప్రాథమిక పాఠశాలగా మంజూరు చేసింది. దీంతో ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయులు పనిచేసే అవకాశం ఏర్పడింది.

ఈ సందర్భంగా ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడ్డెపు కామేష్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామస్థులు, తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయుల సమిష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. పని సర్దుబాటు కౌన్సెలింగ్‌లో భాగంగా తాను సహా మరో ముగ్గురు ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఈ పాఠశాలలో విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం గ్రామస్థులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని మోడల్ ప్రాథమిక పాఠశాలను మంజూరు చేయడం సంతోషకరమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జోష్నా, ఉపాధ్యాయులు బుడ్డెపు కామేష్ రెడ్డి, బోత్స శ్రీనివాస్, మెండా సుజాత, వెంకటరమణ పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story