Palasa: మహిళలు, యువతకు ఉపాధి.. సముద్రపు నాచు తయారీకి శ్రీకారం

Palasa: పలాస నియోజకవర్గంలో మత్స్యకారుల ఆదాయం పెంచేందుకు సముద్రపు నాచు (Seaweed) సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.

B LOKANADHAM, PALASA
Published on: 27 April 2026 9:50 PM IST
Palasa
X

Palasa: మహిళలు, యువతకు ఉపాధి.. సముద్రపు నాచు తయారీకి శ్రీకారం

Palasa: పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కర్త గౌరవ శ్రీ వెంకన్న చౌదరి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారుల ఆదాయాన్ని పెంచే దిశగా సముద్రపు నాచు (Seaweed) తయారీపై ప్రత్యేక చర్యలు ప్రారంభమయ్యాయి.

ఈ నేపథ్యంలో చెన్నైకి చెందిన పరిశోధకులు dr. ఆదివిశ్వనాధ్ గారు , dr. గౌతమ్ గారు , D రమణ వారి బృందం మరియు స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సముద్ర తీర ప్రాంతాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా నిపుణులు సముద్రపు నాచు సాగు, దాని పెంపకం, సేకరణ మరియు మార్కెటింగ్ విధానాలపై మత్స్యకారులకు సమగ్ర అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందే అవకాశాలు ఈ రంగంలో ఉన్నాయని వారు వివరించారు. ముఖ్యంగా మహిళలు మరియు యువత ఈ రంగంలో పాల్గొంటే కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని సూచించారు.

అనంతరం చెన్నై బృందం వారు తీరప్రాంతాలను సందర్శించి, సముద్రపు నాచు పెంపకానికి అనుకూలమైన ప్రదేశాలను గుర్తించింది. వాతావరణ పరిస్థితులు, నీటి నాణ్యత, తీర ప్రాంత భౌగోళిక పరిస్థితులను పరిశీలించి నివేదిక సిద్ధం చేయనున్నట్లు వెల్లడించింది.

స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, సముద్రపు నాచు తయారీ ద్వారా మత్స్యకారులకు అదనపు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. త్వరలో పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి, అవసరమైన శిక్షణ, సబ్సిడీలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేసారు .

ఈ కార్యక్రమం ద్వారా మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడటమే కాకుండా, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

B LOKANADHAM, PALASA

B LOKANADHAM, PALASA

Next Story