Kanchili: కంచిలిలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం!

Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మార్కెట్ యార్డులో ఏపీ గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. రెడ్‌క్రాస్ సహకారంతో అధికారులు, సిబ్బంది రక్తదానం చేసి సామాజిక బాధ్యత చాటుకున్నారు.

G.RAMBABU, SOMPET
Published on: 4 Sept 2026 12:43 PM IST
Kanchili
X

Kanchili: కంచిలిలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం!

Kanchili: కంచిలి మండల మార్కెట్‌యార్డులో ఇచ్ఛాపురం నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్‌ గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. శ్రీకాకుళం రెడ్‌క్రాస్‌ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి ఉపయోగపడేలా రక్తదానం చేయడం సామాజిక బాధ్యతగా భావించాలని ఈ సందర్భంగా సూచించారు.

శిబిరంలో మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ పి. శ్రీరాములు, మాజీ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎన్. గణపతి, డివైఈఈ వి.వి. సత్యాజీ, కంచిలి ఏఈ ఆర్. దిలీప్, ఐపీఎం అర్బన్‌ ఏఈ వి.ఎం. ప్రసాద్, సోంపేట ఏఈ జె.వి. రవిచంద్ర, కవిటి ఏఈ పి. చాణక్య, ఐపీఎం రూరల్‌ ఏఈ ఎ. విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story