Kaviti: రాజపురం హెచ్‌ఎం శివరాం ప్రసాద్‌కు గ్రామస్తుల ఘన సన్మానం!
Kaviti: రాజపురం ZPHS హెచ్‌ఎం పాడి శివరాం ప్రసాద్‌కు ‘బెస్ట్ హెచ్‌ఎం అవార్డు’ రావడంపై కవిటి మండలంలో గ్రామస్తులు, పాఠశాల కమిటీ ఘన సన్మానం.
Kaviti: రాజపురం హెచ్‌ఎం శివరాం ప్రసాద్‌కు గ్రామస్తుల ఘన సన్మానం!
Kaviti: కవిటి మండల పరిధిలోని రాజపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాడి శివరాం ప్రసాద్ ‘బెస్ట్ హెచ్‌ఎం అవార్డు’ అందుకున్న సందర్భంగా గ్రామస్తులు ఆయనను ఘనంగా సన్మానించారు.
స్థానిక ఎంపీటీసీ సనపల కృష్ణారావు, పాఠశాల కమిటీ అధ్యక్షుడు పర్రి రాఘవతో పాటు గ్రామ పెద్దలు, పాఠశాల కమిటీ సభ్యులు శివరాం ప్రసాద్‌కు దుశ్శాలువ కప్పి అభినందనలు తెలిపారు.
ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఆయనకు ఈ అవార్డు లభించడం పాఠశాలకే కాకుండా గ్రామానికీ గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థుల అభివృద్ధి, పాఠశాల ప్రగతికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బుడంకాయల వెంకటరావు, రత్నాల బలరాం చౌదరి, మాధవ్ బిసాయ్, బెందాళం డిల్లిబాబు, సంక వెంకటరావు, కడియాల వెంకటరావు, లొట్టి సోమేష్, ఆనింగి భాస్కరరావు, సప్పటి డిల్లితో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.




