Narasannapeta: జాతీయ రహదారిపై ఆటో ప్రమాదం ఇద్దరికి తీవ్ర గాయాలు!
Narasannapeta: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఆటోను బయటకు తీసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన సబ్ ఇన్స్పెక్టర్ గణేష్ మరియు స్థానికులు.
Narasannapeta: జాతీయ రహదారిపై ఆటో ప్రమాదం ఇద్దరికి తీవ్ర గాయాలు!
Narasannapeta: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఈ రోజు ఉదయం సుమారు 06:45 గంటల సమయంలో KA 07 C 2789 నంబర్ గల వాహనాన్ని మేఘన హోటల్ ఎదురుగా బ్రిడ్జిపై ఆపి ఉంచి ఉండగా, విజయనగరం జిల్లా జామి ప్రాంతానికి చెందిన AP 39 WG 1026 నంబర్ గల ఆటో డ్రైవర్ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ, అతివేగంగా మరియు నిర్లక్ష్యంగా ఆటో నడుపుతూ వచ్చి ముందున్న వాహనం వెనుక భాగాన్ని ఢీ కొట్టడం జరిగింది.
ఈ ప్రమాదంలో ఆటో లో ఉన్న వారు డ్రైవర్ మరి ప్రక్కన కూర్చున్న అతను ఇరుక్కుపోవడంతో, స్థానిక ప్రజలు, ఇతర వాహనదారులు మరియు నరసన్నపేట సబ్ ఇన్స్పెక్టర్ గణేష్ గారు ఎంతో చాకుచక్యంగా ఇరుక్కున్న క్షతగాత్రులను హైవే-4 పోలీసుల సహాయంతో
సురక్షితంగా బయటకు తీసి, తదుపరి చికిత్స నిమిత్తం అంబులెన్సు లో ఆసుపత్రికి తరలించడం జరిగింది.




