Palakonda: వేద మంత్రాల సాక్షిగా ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్ట మహోత్సవం

Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం అంపిలి గ్రామంలో శ్రీ అమర నాగ లింగేశ్వర ఆలయ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది.

KAILASH SAHU, PALAKONDA
Published on: 26 Jun 2026 8:56 AM IST
Palakonda
X

Palakonda: వేద మంత్రాల సాక్షిగా ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్ట మహోత్సవం

Palakonda: మన్యం జిల్లా పాలకొండ మండలంలోని అంపిలి గ్రామంలో పవిత్ర నాగావళి నది తీరంలో అమర నాగ లింగేశ్వర ఆలయ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ద్వాపర యుగంలో బలరాముడు తన నాగలి పదునుతో ఈ ప్రాంతంలోని కరువు కాటకాలను తొలగించేందుకు నాగావళి నదిని తవ్వినట్టుగా చరిత్ర చెబుతుంది.

స్వయానా ఆయన చేతులమీదుగా కపోత మల్లేశ్వర స్వామి, గుప్తేశ్వరస్వామి, సంఘమేశ్వర స్వామి, ఉమారుద్రకోటేశ్వర స్వామి, మణి నాగేశ్వర స్వామి అను పంచలింగాల క్షేత్రములగా ప్రతిష్ఠించబడి పూజలందుకొనుచున్నాయి. కాగా నేడు పాలకొండలో నవీనముగా అంపిలి గ్రామంలో అమర నాగ లింగేశ్వర స్వామిగా నూతన ఆలయం నాగావళి తీరంలో గ్రామస్తులు నిర్మించడం పరమశివుని మరో క్షేత్రానికి నాగావళి సజీవ సాక్ష్యమైంది.

వేదపండితులు జోష్యుల కూర్మనాధ శర్మ, ఆంజనేయ శర్మల చేతులమీదుగా అమరనాగ లింగేశ్వరుడు ప్రతిష్ట చేసుకొని భక్తులకు దర్శనం కల్పిస్తున్నాడు. ఈ నెల 22 నుండి 25 వ తేదీ వరకు మహా రుద్రాభిషేకాలు, బిళ్వార్చనాలు, రుద్రాహోమాలతో 5రోజులపాటు పూజాదికాలు నిర్వహించారు. కార్యక్రమంలో ద్వజస్థంభ ప్రతిష్ట మరియు శిఖరప్రతిష్ట నిర్వహించి దాదాపు 12 వేల మందికి అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story