Amadalavalasa: మిర్తిబట్టి కెనాల్ ఆక్రమణలపై సవాల్!
Amadalavalasa: మిర్తిబట్టి కెనాల్‌ను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై చింతాడ రవికుమార్ ఆగ్రహం.
Amadalavalasa: మిర్తిబట్టి కెనాల్ ఆక్రమణలపై సవాల్!
Amadalavalasa: మిర్తి బట్టి కి సంబంధించిన కెనాల్ ని ఆక్రమణ ఆపాలి అది కెనాల్ కాదంటూ ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ అనడం హాస్యాస్పదంగా ఉందని దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు ఆముదాలవలస వైయస్సార్సీపి సమన్వయకర్త చింతాడ రవికుమార్.
ఆముదలవలసలో వైసిపి కార్యాలయంలో మీడియా సమావేశం మాట్లాడుతూ టిడిపి ఎమ్మెల్యే కూన రవికుమార్ పై మండిపడ్డ చింతాడ రవికుమార్ మిర్తిబట్టి కెనాల్ పై నిర్మాణాలు చేయడం తగదు, కెనాల్, బండ్ ను ఆక్రమించడం సిగ్గుమాలిన చర్య అంటూ మండిపడ్డారు. కెనాల్ పై నిర్మాణాలను వెంటనే అడ్డుకోకుంటే అధికారులపై ఫిర్యాదు చేస్తాం రైతుల తరఫున పోరాటం చేస్తాం అధికారులు కూడా వదిలిపెట్టడం జరగదు అని హెచ్చరించారు.
ఆముదాలవలస నియోజకవర్గంలో భూ, ఇసుక, ఖనిజ దోపిడీ, తప్పుడు ధ్రువపత్రాలు సృష్టికర్త కూన రవికుమార్ నెంబర్ వన్ అని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డిని విమర్శించే స్థాయి మీది కాదు అంటూ హితవు పలికారు. కెనాల్ గట్లను ఆక్రమించే వ్యక్తి ఎమ్మెల్యేగా అర్హుడా అని ప్రశ్నించారు. 48 గంటలలోగా పనులను ఆపుచేసి నిర్మాణాలు తొలగించాలి అంటూ డిమాండ్ చేశారు. లేకుంటే 24న(శుక్రవారం) రైతులతో కలిసి నిర్మాణాలను తొలగిస్తాం దమ్ముంటే ఆపుకో అంటూ సవాల్ విసిరారు.




