Palakonda: పాలకొండలోని 8 వార్డుల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం!

Palakonda: పాలకొండ AIIB పైప్‌లైన్ తవ్వకాలతో 8 వార్డుల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం.. ట్యాంకర్లతో నీటినందిస్తామని కమిషనర్ విజ్ఞప్తి.

KAILASH SAHU, PALAKONDA
Published on: 2 Sept 2026 1:11 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండలోని 8 వార్డుల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం!

Palakonda: పాలకొండ నగర పంచాయతీ వెంకంపేట పరిధిలో AIIB క్రొత్త పైపులైను JCB ద్వారా త్రవ్వకాలు జరుగుతున్నాయి. తద్వారా క్రిందన ఉన్న పాత పైపులైను కొన్ని కొన్ని ప్రాంతాల్లో తవ్వకాలవల డామేజ్ జరుగుతుంది. కనుక పైపులైను ఎప్పటికప్పుడు రిపేర్ అవుతూ వాటర్ సమస్య ఉంటుంది. (ప్రస్తుతం వెంకంపేట ట్యాంకు పరిధిలో పని జరుగుతున్నందున అక్కడ వారికే ఇబ్బంది) కావున పై ట్యాంక్ పరిధి లో గల 1,2,11,12,17,18,19,20 వార్డులకు కుళాయిలు సక్రమంగా రావు.

పనులు పూర్తి అయిన అనంతరం నీటిసరఫరా ఇవ్వగలమని, సహకరించాలని ఈ సందర్బంగా కమీషనర్ వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతవరకు వాటర్ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయగలమని తెలియజేశారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story