Sompeta: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో కండువా కప్పుకున్న నేతలు!

Sompeta: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం గుండంలో తెలుగుదేశం పార్టీలోకి 41 కుటుంబాలు కండువా కప్పి ఆహ్వానించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.

G.RAMBABU, SOMPET
Published on: 4 Sept 2026 2:50 PM IST
Sompeta
X

Sompeta: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో కండువా కప్పుకున్న నేతలు!

Sompeta: కంచిలి మండలం గుండం గ్రామానికి చెందిన 41 కుటుంబాలు గురువారం తెలుగుదేశం పార్టీలో చేరాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమక్షంలో వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ పాల్గొని నూతనంగా పార్టీలో చేరిన వారికి అభినందనలు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ కుటుంబాలు పార్టీలో చేరుతున్నాయని నాయకులు పేర్కొన్నారు.

గుండం గ్రామానికి చెందిన 41 కుటుంబాల చేరికతో గ్రామంలో పార్టీకి మరింత బలం చేకూరిందని, రానున్న రోజుల్లో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిన రామారావు, వాసాల రమేష్, మాదిన ప్రదీప్, జనసేన ఇంఛార్జ్ దాసరి రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story