Kanchili: మంత్రి నారా లోకేష్‌ను కలిసి అభివృద్ధికి నిధులు కోరిన నాగేష్!

Kanchili: కంచిలి మండలం బూరగాం గ్రామంలో తారు రోడ్డు, దొరగుండం చెరువు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్‌ను బద్రి నాగేష్ కోరారు.

G.RAMBABU, SOMPET
Published on: 21 Aug 2026 6:22 AM IST
Kanchili
X

Kanchili: మంత్రి నారా లోకేష్‌ను కలిసి అభివృద్ధికి నిధులు కోరిన నాగేష్!

Kanchili: కంచిలి మండల పరిధిలోని బూరగాం గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన బద్రి నాగేష్ విజయవాడలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో చేపట్టాల్సిన కీలక అభివృద్ధి పనులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

బూరగాం స్మశానం నుంచి గ్రామదేవత అమ్మవారి ఆలయం మీదుగా జలంత్రకోట రోడ్డు వరకు తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ రహదారి నిర్మాణంతో బూరగాం, జలంత్రకోట మధ్య రాకపోకలు సులభతరం కావడంతో పాటు గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని వివరించారు.

అదేవిధంగా గ్రామానికి సాగునీటి వనరుగా ఉన్న దొరగుండం చెరువు (పాత చెరువు) అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. చెరువు అభివృద్ధి జరిగితే రైతులకు సాగునీటి వసతి మెరుగుపడి వ్యవసాయానికి మేలు జరుగుతుందని తెలిపారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత పనులకు నిధులు మంజూరు చేసి త్వరితగతిన అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story