Hardik Pandya: హార్దిక్ ఎందుకు ఆడలేదు.. అసలు విషయం చెప్పేసిన ముంబై!

Hardik Pandya: సోమవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌కు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య దూరం కావడం హాట్‌ టాపిక్‌గా మారింది.

Rishvik
Published on: 5 May 2026 6:51 PM IST
Hardik Pandya
X

Hardik Pandya: హార్దిక్ ఎందుకు ఆడలేదు.. అసలు విషయం చెప్పేసిన ముంబై!

Hardik Pandya: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ (ఎంఐ) వరుస పరాజయాలతో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. కెప్టెన్ హార్దిక్ పాండ్య ఇటు ఆటగాడిగా, అటు సారథిగా విఫలమవుతున్నాడు. హార్దిక్ తీరు వల్లే ముంబై పేలవ ప్రదర్శన చేస్తోందని అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో సోమవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌కు హార్దిక్ దూరం కావడం హాట్‌ టాపిక్‌గా మారింది. టాస్‌కు సూర్యకుమార్ యాదవ్ రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మ్యాచ్ అనంతరం ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చింది.

హార్దిక్ పాండ్య అనారోగ్యంతో మ్యాచ్‌కు దూరమయ్యాడని సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో చెప్పాడు. ఆ తరువాత అతనికి బ్యాక్ స్పాసమ్స్ (వెన్నునొప్పి) సమస్య తలెత్తినట్లు తెలిసింది. ఈ విషయాన్ని హార్దిక్ సహచర ఆటగాడు, ముంబై ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ వెల్లడించాడు. 'మధ్యాహ్నం వరకు కూడా హార్దిక్ పాండ్య పరిస్థితి గురించి నాకు తెలియదు. అతనికి వెన్నునొప్పి (బ్యాక్ స్పాసమ్స్) ఉందని అప్పుడే తెలిసింది. గాయం తీవ్రత ఎంత ఉందో తెలియదు. కానీ త్వరలోనే జట్టులోకి తిరిగి వస్తాడని ఆశిస్తున్నాం' అని రికెల్టన్ తెలిపాడు. ఆర్సీబీతో మ్యాచ్‌ కోసం రాయ్‌పూర్‌కు బయలుదేరే సమయానికి హార్దిక్ కోలుకుంటాడని రికెల్టన్ ధీమా వ్యక్తం చేశాడు.

హార్దిక్ పాండ్య గైర్హాజరీతో లక్నో మ్యాచ్‌లో ముంబై జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. గాయంతో గత కొన్ని మ్యాచులకు దూరమైన రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చాడు. అలాగే ట్రెంట్ బౌల్ట్ స్థానంలో కార్బిన్ బోష్‌కు అవకాశం ఇచ్చారు. మిగతా జట్టు యథాతథంగా కొనసాగింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోర్ చేసింది. నికోలస్ పూరన్ (63), Mitcహెల్ మార్ష్(44), హిమ్మత్ సింగ్ (40) రాణించడంతో 20 ఓవర్లలో 228/5 స్కోర్ చేసింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై అద్భుతంగా ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (84), ర్యాన్ రికెల్టన్ (83) 143 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్‌ను మలుపు తిప్పారు. వీరి దూకుడుతో ముంబై కేవలం 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ప్రస్తుతం ముంబై పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉండగా.. లక్నో చివరి స్థానంలో కొనసాగుతోంది. ఈ విజయం ముంబైకి మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఇప్పటికే ప్లేఅఫ్ అవకాశాలు దూరం చేసుకున్న ముంబై.. పరువు కోసం పోరాటం చేయనుంది. హార్దిక్ పాండ్య త్వరగా కోలుకుని తిరిగి జట్టులోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story