Virat Kohli: అభిమానం అంటే ఇది.. చిన్నారికి ఆర్సీబీ స్టైల్‌లో పేరు రివీల్ చేసిన జంట

Virat Kohli: మహారాష్ట్రకు చెందిన ఒక జంట తమ బిడ్డకు 'విరాట్' అని పేరు పెట్టి కింగ్ కోహ్లీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Naresh.k
Updated on: 13 April 2026 9:50 AM IST
Virat Kohli
X

Virat Kohli: అభిమానం అంటే ఇది.. చిన్నారికి ఆర్సీబీ స్టైల్‌లో పేరు రివీల్ చేసిన జంట

Baby Naming Video: క్రికెట్ అంటే భారతీయులకు ఒక మతం.. విరాట్ కోహ్లీ ఆ మతానికి ఒక దేవుడు. కింగ్ కోహ్లీపై తమకున్న వీరాభిమానాన్ని చాటుకోవడానికి ఫ్యాన్స్ ఒక్కోసారి ఒక్కో వినూత్న మార్గాన్ని ఎంచుకుంటారు. తాజాగా మహారాష్ట్రకు చెందిన ఒక దంపతులు తమ నవజాత శిశువుకు విరాట్ కోహ్లీ పేరును పెట్టడమే కాకుండా, ఆ పేరును ప్రకటించిన తీరు ఇప్పుడు నెట్టింట సెన్సేషన్‌గా మారింది.

ఆర్సీబీ జెర్సీతో సర్ప్రైజ్

సాధారణంగా నామకరణ వేడుకలు సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. కానీ ఈ జంట తమ బిడ్డ పేరును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు థీమ్‌తో ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. గౌరీ మహాదిక్ అనే సోషల్ మీడియా యూజర్ షేర్ చేసిన వీడియో ప్రకారం.. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఒక కాన్వాస్ తాడును విప్పగానే, లోపల కోహ్లీ ఐకానిక్ నెంబర్ 18 ఆర్సీబీ జెర్సీ కనిపించింది. ఆ జెర్సీపై VIRAT అని రాసి ఉండటంతో వేడుకకు వచ్చిన అతిథులంతా కేరింతలు కొట్టారు.

ఎందుకు ఈ పేరు?

కేవలం క్రికెట్ అంటే ఇష్టం మాత్రమే కాదు, కోహ్లీలో ఉండే అంకితభావం , ఎప్పుడూ తగ్గని పట్టుదల తమ బిడ్డకు కూడా రావాలన్నదే ఆ దంపతుల ఆకాంక్ష. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరైన విరాట్ కోహ్లీ లక్షణాలు మా బిడ్డలో ఉండాలని కోరుకుంటున్నాం అని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

నెట్టింట వైరల్..

ఈ వినూత్న నామకరణ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఇప్పటి వరకు నేను చూసిన అత్యంత క్రియేటివ్ నామకరణ వేడుక ఇదే అని ఒకరు కామెంట్ చేయగా.. జూనియర్ విరాట్ వచ్చేసాడు అని మరికొందరు సంబరపడుతున్నారు. ఈ జంట తమ పోస్ట్‌లో విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మలను ట్యాగ్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో క్రికెట్ సర్కిల్స్‌లో విపరీతంగా షేర్ అవుతోంది.



Naresh.k

Naresh.k

Next Story