Kohli vs Gill: కోహ్లీ-గిల్ బిగ్ ఫైట్.. ఆ ఒక్క క్యాచ్‌తో మారిన మ్యాచ్ తలరాత!

Kohli vs Gill: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అవుట్ విషయంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో తీవ్ర వాగ్వాదం జరిగింది.

Naresh.k
Published on: 1 Jun 2026 10:09 AM IST
Kohli vs Gill
X

Kohli vs Gill: కోహ్లీ-గిల్ బిగ్ ఫైట్.. ఆ ఒక్క క్యాచ్‌తో మారిన మ్యాచ్ తలరాత!

Kohli vs Gill: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ముగింపు దశ.. మైదానమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్న వేళ.. ఒక్కసారిగా హై-వోల్టేజ్ డ్రామా చోటుచేసుకుంది. టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అవుట్ విషయంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో తీవ్ర వాగ్వాదం జరిగింది. అంపైర్లు, ఇద్దరు అగ్రశ్రేణి భారత ఆటగాళ్ల మధ్య జరిగిన ఈ మైదాన యుద్ధం క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా షేక్ చేసింది.

గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఈ రసవత్తర ఫైనల్ పోరులో 16వ ఓవర్ ఆఖరి బంతికి అసలు డ్రామా మొదలైంది. అర్షద్ ఖాన్ వేసిన బంతిని విరాట్ కోహ్లీ గాల్లోకి లేపాడు. మిడ్-ఆఫ్ దిశగా పరిగెత్తుకుంటూ వచ్చిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ముందుకు డైవ్ చేస్తూ ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. మైదానంలో ఉన్న అంపైర్లు వెంటనే దానిని అవుట్‌గా ప్రకటించడంతో.. గుజరాత్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోగా, కోహ్లీ నిరాశగా వెనుతిరగడం ప్రారంభించాడు. కానీ, అసలు ట్విస్ట్ అక్కడే మొదలైంది.పెవిలియన్ వైపు కొద్ది దూరం నడిచిన కోహ్లీ, గిల్ పట్టిన క్యాచ్‌పై అనుమానంతో వెనక్కి తిరిగాడు. బంతి నేలకు తాకినట్లు భావించిన విరాట్.. వెంటనే ఆన్-ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ వద్దకు వెళ్లి ఖచ్చితంగా టీవీ అంపైర్ ద్వారా పునఃపరిశీలించాలని డిమాండ్ చేశాడు.

మొదట్లో అంపైర్ దీనిపై పెద్దగా ఆసక్తి చూపించనప్పటికీ, కోహ్లీ తీవ్ర అసంతృప్తితో అంపైర్లను నిలదీయడంతో మైదానంలో ఒక్కసారిగా ఉద్రిక్తత రేగింది. ఇరుపక్షాల మధ్య కాసేపు తీవ్రమైన హీట్ వెదర్ కనిపించింది. చివరికి అంపైర్లు తమ తుది నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు బదిలీ చేయక తప్పలేదు. టీవీ రీప్లేలో విభిన్న కోణాల నుంచి ఆ క్యాచ్‌ను చాలా నిమిషాల పాటు పరిశీలించారు. గిల్ వేళ్లు బంతి కింద ఉన్నాయా లేదా బంతి ముందే నేలకు తాకిందా అనే కోణంలో సుదీర్ఘమైన తనిఖీ జరిగింది. చివరకు బంతి భూమిని తాకినట్లు స్పష్టమవ్వడంతో థర్డ్ అంపైర్ స్క్రీన్‌పై ‘నాట్ అవుట్’ అని ప్రకటించారు!

ఈ నిర్ణయంతో కోహ్లీ గాల్లోకి చేతులు ఊపుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేయగా.. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై గిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన వేళ్లు బంతి కిందనే ఉన్నాయని, అది క్లీన్ క్యాచ్ అని విరాట్ కోహ్లీతో గిల్ నేరుగా మైదానంలోనే వాదనకు దిగాడు. ఇద్దరు అగ్రశ్రేణి భారత ఆటగాళ్లు, సీనియర్-జూనియర్ అనే తేడా లేకుండా ఐపీఎల్ ఫైనల్ వంటి ప్రతిష్టాష్టాత్మక వేదికపై ఇలా వాదించుకోవడం అభిమానులను సైతం తీవ్ర ఆశ్చర్యపరిచింది.


Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story