ఒక్క సెంచరీ కోసం 3 ఏళ్లు కింగ్ కోహ్లీ వెయిటింగ్.. భారత క్రికెట్ హిస్టరీలోనే ఊహించని మార్పులు..!

Virat Kohli 70th and 71st Century: 2019లో కోహ్లీ 70వ అంతర్జాతీయ సెంచరీ నుంచి 2022లో 71వ శతకం వరకు భారత క్రికెట్‌లో భారీ మార్పులు జరిగాయి.

Venkat
Published on: 8 Sept 2026 6:45 PM IST
Virat Kohli 70th and 71st Century
X

ఒక్క సెంచరీ కోసం 3 ఏళ్లు కింగ్ కోహ్లీ వెయిటింగ్.. భారత క్రికెట్ హిస్టరీలోనే ఊహించని మార్పులు..!

Virat Kohli 70th and 71st Century: విరాట్ కోహ్లీ 70వ అంతర్జాతీయ సెంచరీ చేసినప్పటి నుంచి 71వ శతకం సాధించే వరకు దాదాపు 3 సంవత్సరాలు గడిచాయి. ఈ వ్యవధిలో కోహ్లీ కెరీర్‌తో పాటు ఇండియాన్ క్రికెట్‌లోనూ పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై కోల్‌కతా పింక్‌బాల్ టెస్టులో 70వ సెంచరీ చేసిన కోహ్లీ.. 2022 సెప్టెంబర్ 8న అఫ్గానిస్థాన్‌పై ఆసియా కప్‌లో 71వ శతకాన్ని అందుకున్నాడు.

ధోనీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు..

ఈ మధ్యకాలంలో భారత క్రికెట్‌లో జరిగిన అతిపెద్ద మార్పుల్లో ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ఒకటి. 2020 ఆగస్టు 15న ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో ఆడిన మ్యాచ్‌నే అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలిచింది.

కోహ్లీ కెప్టెన్సీకి ముగింపు..

కోహ్లీ కెప్టెన్సీలోనూ ఈ కాలంలో కీలక మలుపు వచ్చింది. 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఆయనకు, ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ కూడా దూరమైంది. రోహిత్ శర్మ కొత్త వైట్ బాల్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ 2-1తో ఓడిన మరుసటి రోజు కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీని కూడా వదులుకున్నాడు.

ద్రవిడ్ యుగం.. కొత్త మార్పులు..

2021 నవంబర్‌లో రాహుల్ ద్రవిడ్ భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అతని పర్యవేక్షణలో భారత్ 2024 టీ20 ప్రపంచకప్‌ను గెలిచి 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించింది. అదే టోర్నీ తర్వాత కోహ్లీ, రోహిత్ ఇద్దరూ టీ20 ప్రపంచకప్‌లకు వీడ్కోలు పలికారు.

పాక్‌తో చరిత్రలో తొలిసారి ఓటమి..

2021 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. అక్టోబర్ 24న దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్ చేతిలో భారత్‌కు ఇదే తొలి ఓటమి.

IPLలోకి రెండు కొత్త జట్లు..

ఈ సమయంలో IPL కూడా విస్తరించింది. 2022 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ రెండు కొత్త ఫ్రాంచైజీలుగా లీగ్‌లోకి వచ్చాయి. ఆశ్చర్యకరంగా గుజరాత్ టైటాన్స్ తమ తొలి సీజన్‌లోనే టైటిల్ గెలిచింది. ఇలా కోహ్లీ 70వ సెంచరీ నుంచి 71వ శతకం వరకు సాగిన కాలం భారత క్రికెట్‌లో ఆటగాళ్లతో పాటు నాయకత్వం, కోచింగ్, IPLలోనూ గణనీయమైన మార్పులను చూసింది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story