Vaibhav Suryavanshi: నా జీవితంలో మర్చిపోను.. విరాట్ సర్ ఇచ్చిన సలహా ఇదే
Vaibhav Suryavanshi: భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో సంచలన ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు.
Vaibhav Suryavanshi: నా జీవితంలో మర్చిపోను.. విరాట్ సర్ ఇచ్చిన సలహా ఇదే
Vaibhav Suryavanshi: భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో సంచలన ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ 16 మ్యాచ్‌లలో 237.30 స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు చేశాడు. టోర్నీలో దిగ్గజ ప్లేయర్స్ ఉన్నా అందరినీ వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ (అత్యధిక రన్స్) అందుకున్నాడు. వైభవ్ దూకుడు బ్యాటింగ్‌కు క్రికెట్ దిగ్గజాలు అందరూ ఫిదా అయ్యారు. సూర్యవంశీపైభారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు పలు సలహాలు కూడా ఇచ్చాడు. ఈ విషయాన్ని బుడ్డోడు స్వయంగా చెప్పాడు.
లలో కూడా ఊహించలేదు:
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ స్వయంగా తన వద్దకు వచ్చి మాట్లాడటం జీవితంలో మరచిపోలేని క్షణమని వైభవ్ సూర్యవంశీ వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైభవ్ మాట్లాడుతూ.. 'విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాడు నా దగ్గరకు వచ్చి అభినందించడం నాకు చాలా పెద్ద విషయం. ఇలాంటి క్షణం నా జీవితంలో వస్తుందని కలలో కూడా ఊహించలేదు. అది నాకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది. ఆ సమయంలో చాలా సంతోషపడ్డాను' అని చెప్పాడు.
క్రికెట్‌పైనే పూర్తి దృష్టి పెట్టమన్న కోహ్లీ:
2026 ఫైనల్ తర్వాత తనతో మాట్లాడిన విరాట్ కోహ్లీ కొన్ని విలువైన సూచనలు చేశాడని వైభవ్ తెలిపాడు. క్రికెట్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టాలని, ఇతర విషయాల వల్ల దారి తప్పకూడదని విరాట్ సర్ నాకు చెప్పారు. అలాగే నా సహజమైన ఆటతీరును మార్చుకోవద్దని, ఇప్పటివరకు ఎలా ఆడానో అలాగే ఆత్మవిశ్వాసంతో కొనసాగాలని సూచించారని వెల్లడించాడు. విరాట్ సర్ ఇచ్చిన సలహాను తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుంచుకుంటానని వైభవ్ పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లకు ప్రేరణగా నిలిచే ఈ సంఘటన ప్రస్తుతం క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
వైభవ్‌కు మరింత ప్రేరణ:
కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీకి విరాట్ కోహ్లీ వంటి దిగ్గజం నుంచి ప్రశంసలు రావడం అతని కెరీర్‌లో మరో కీలక మైలురాయి అని చెప్పొచ్చు. ఇప్పటికే ఆరెంజ్ క్యాప్ గెలిచి సంచలనం సృష్టించిన వైభవ్.. భవిష్యత్తులో భారత జట్టుకు కీలక ఆటగాడిగా ఎదగనున్నాడు. బుడ్డోడి కెరీర్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నా.. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. త్వరలోనే వైభవ్ భారత జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.




