Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి టీమిండియాలో అవకాశం ఇవ్వొద్దు.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు!

Vaibhav Sooryavanshi: మహమ్మద్ కైఫ్, మైకెల్ వాన్ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భిన్నాభిప్రాయం వ్యక్తం చేశాడు. యాష్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. వైభవ్‌ సూర్యవంశీకి ఇప్పుడే అంతర్జాతీయ స్థాయిలో అవకాశం ఇవ్వడంపై తొందరపడకూడదని స్పష్టం చేశాడు.

Rishvik
Published on: 31 March 2026 9:11 PM IST
Vaibhav Sooryavanshi India Debut Debate: Ashwin Urges Patience After IPL 2026 Heroics
X

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సోమవారం గువాహటి వేదికగా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన అతడు కేవలం 15 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు. ఫాస్టెస్ట్‌ హాఫ్ సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా వైభవ్‌ అరుదైన ఘనత సాధించాడు. ఇటీవల అండర్ -19లో దూకుడుగా ఆడిన అతడికి వెంటనే టీమిండియాలో అవకాశం ఇవ్వాలని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్, ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ వంటి వారు బీసీసీఐకి సూచించారు. రాబోయే ఇంగ్లాండ్‌ పర్యటనకు వైభవ్‌ను పంపించాలని వాన్ పేర్కొన్నాడు.

మహమ్మద్ కైఫ్, మైకెల్ వాన్ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భిన్నాభిప్రాయం వ్యక్తం చేశాడు. యాష్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. వైభవ్‌ సూర్యవంశీకి ఇప్పుడే అంతర్జాతీయ స్థాయిలో అవకాశం ఇవ్వడంపై తొందరపడకూడదని స్పష్టం చేశాడు. 'వైభవ్‌ ఇంకా చిన్నవాడు. అతడిపై అప్పుడే ఒత్తిడి పెంచొద్దు. వైభవ్‌కు ఇంకా చాలా కాలం క్రికెట్ ఆడే అవకాశం ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు టీమిండియాలోకి వస్తాడు' అని అశ్విన్ పేర్కొన్నాడు.

వైభవ్‌ సూర్యవంశీ ప్రతిభపై అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. '15 ఏళ్ల వయసులోనే 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం గొప్ప విషయం. వైభవ్‌ బ్యాటింగ్, బ్యాట్ స్పీడ్ అద్భుతంగా ఉంది. అతడి బ్యాటింగ్ ముందు సీఎస్‌కే బౌలర్లు తేలిపోయారు. వైభవ్ ప్రతిభ చూస్తే భవిష్యత్తులో టీమిండియాకు కీలక ఆటగాడిగా మారడం ఖాయం' అని యాష్ అభిప్రాయపడ్డాడు. వైభవ్ వంటి యువ ప్రతిభ జట్టులో ఉండటం రాజస్థాన్ జట్టుకు పెద్ద బలం అని కూడా పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ టైటిల్ రేసులో బలమైన పోటీదారుగా నిలుస్తుందన్నాడు. యువ ఆటగాళ్లను సరిగ్గా తీర్చిదిద్దితే భారత క్రికెట్‌కు గొప్ప భవిష్యత్తు ఉంటుందని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story